MoviesTollywood news in telugu

కధానాయుకులు రాజకీయాల్లో ఎందుకు ఎంట్రీ ఇచ్చారో చూడండి

Heroes Made Political Entry :సినిమా వేరు, రాజకీయం వేరు. రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ సక్సెస్ కావాలంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం వరకూ ఒకవిధంగా , వచ్చాక మరోవిధంగా పరిస్థితులు ఉంటాయి. అయితే ఎందరో హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మీకోసం నేనొస్తున్నా అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళనాట ఎంజీఆర్ సక్సెస్ అయ్యారు. డీఎంకే లో విభేదాలతో అన్నా డీఎంకే స్థాపించి సీఎం అయ్యారు. 10ఏళ్ళు సీఎం గా సేవలందించారు.

తెలుగుజాతి గుండెల్లో నిల్చిన ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి, అగ్ర హీరోగా వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చారు.1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. సీఎం అయ్యారు. ఆయన తెలుగునాట ఓ చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఇక బాలీవుడ్ నటుడు దేవానంద్ 1979లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట పార్టీ పెట్టి, విఫలమయ్యారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ తర్వాత అంతటి ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి 2008లో అభిమాన జనమే సంద్రంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.

18సీట్లు సాధించి, కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో ప్రశ్నించేందుకే అంటూ జనసేన పార్టీ పెట్టి, అప్పట్లో బిజెపి, టిడిపిలకు మద్దతిచ్చారు. 2019ఎన్నికల్లో పోటీ చేసి, కేవలం ఒక్క సీటు దక్కించుకున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ , సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర 2018లో రాజకీయ పార్టీ పెట్టి అభ్యర్థులను బరిలో దించారు. అలాగే తమిళనాట విజయకాంత్ పార్టీ పెట్టి విపక్ష నేతగా నెట్టుకొస్తున్నారు. కమల్ హాసన్ కూడా 2018లో పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కసరత్తు చేస్తున్నారు. శరత్ కుమార్ కూడా 2007లో పార్టీ పెట్టి, అన్నా డిఎంకెతో పొత్తు పెట్టుకుని రెండు సీట్లు గెలిచారు.