తుపాకి సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
Thuppakki Full Movie :రజనీకాంత్ తర్వాత తమిళంలో సూపర్ స్టార్ హోదా తెచ్చుకున్న విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇళయదళపతిగా ఫాన్స్ పిలుచుకునే విజయ్ కి తుపాకి మూవీ మంచి ఇమేజ్ తెచ్చింది. స్టైలిష్ ఇమేజ్ తీసుకొచ్చిన ఈ మూవీ 2012లో రిలీజై, తమిళనాట నాన్ రజనీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ మురుగుదాస్ తన తొలిసినిమా విజయ్ తో చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. దాంతో విజయ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్న మురుగుదాస్ కి ఆ ఛాన్స్ వచ్చింది. అప్పటికే హిట్స్ లేకపోవడంతో విజయ్ వెంటనే మురుగుదాస్ కి ఒకే చెప్పాడు. హీరోయిన్ గా ఓ మోడల్ ని అనుకుని స్టిల్స్ తీసాక ఎందుకో ఆ ప్లేస్ లో కి కాజల్ వచ్చేసింది. ఇక సత్యరాజ్ ని అడిగితె ఆయన రిజెక్ట్ చేయడంతో జయరాం ని తీసుకున్నారు. హరీశ్ జైరాజ్ మ్యూజిక్. సంతోష్ శివన్ డీవోపీ.
వివిధ రకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినా, 2011డిసెంబర్ చివరిలో తుపాకిగా అధికారిక ప్రకటన వచ్చింది. 2012జనవరి 8నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్. చెన్నైలో కొంత, 70శాతం ముంబైలో తీశారు. బ్యాంకాక్, స్విడ్జర్లాండ్ లలో సాంగ్స్ తీశారు. ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ముంబైలో తీసిన సాంగ్ లో 300మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజునాడు రిలీజ్ చేయాలనీ షూటింగ్ శరవేగంగా తీస్తుంటే, టెర్రరిస్ట్ ని పట్టుకునే ఛేజింగ్ సీన్ లో విజయ్ కి గాయం కావడం, లండన్ వెళ్లడంతో షూటింగ్ ఆగింది. అక్టోబర్ లో షూటింగ్ పూర్తయింది. ఈ మధ్యలో విజయ్ పోస్టర్స్ ఫాన్స్ లో అంచనాలు పెంచాయి. 2012నవంబర్ 13న రిలీజ్. ఫాన్స్ హంగామా అదిరింది.
కేరళలో వేకువఝామున షో పడిన విజయ్ తొలిమూవీ ఇదే. ఆర్మీలో పనిచేసి ఓ వ్యక్తి నెలరోజుల సెలవులపై వచ్చి ముంబయిలో టెర్రిస్టులను పట్టుకోవడం ద్వారా ఆర్మీ ఎక్కడున్నా సెలవలు ఉండవనే ఓ మెసేజ్ ఈ సినిమాతో ఇచ్చాడు. ఫాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. సరదాగా స్టార్ట్ అయిన ఈ మూవీ బాంబ్ బ్లాస్ట్ తో ఇంటర్వెల్ కి మెంటల్ ఎక్కిస్తుంది. ఇండియన్ ఆర్మీకి, వారి కుటుంబాలకు అంకితమిచ్చిన ఈ మూవీ సెకండాఫ్ లో హీరో, విలన్ ల మధ్య మైండ్ గేమ్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. విజయ్ నటన ఒక ఎత్తైతే, మురుగుదాస్ టాలెంట్ గొప్ప దర్శకుణ్ణి చూపించింది. తెలుగులో కూడా మినిమమ్ 10కోట్ల బిజినెస్ చేసేలా తుపాకి విజయ్ కి లైఫ్ ఇచ్చింది. తమిళనాడులో 70కోట్లు, వరల్డ్ వైడ్ 120కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ముస్లిమ్స్ ని టెర్రరిస్టులుగా చూపించారని ఆందోళన చేయడంతో డైరెక్టర్ క్షమాపణ చెప్పి, కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగించారు. హిందీ, బెంగాలీలో రీమేక్ చేయగా హిట్ అయింది.