ఈ ఏడాది బాగా పాపులర్ అయిన వంటకం ఏదో తెలుసా?

cloud bread recipe :మనలో చాలా మంది బేకరీ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చాలా మంది ఇప్పటికీ బయటకు వెళ్ళితే జంక్ ఫుడ్స్ మరియు బేకరీ ఫుడ్ పై ఎక్కువ ఆసక్తి కనపరచటమే కాకుండా ఇష్టంగా తింటారు. రకరకాల వంటలను సోషల్ మీడియా ద్వారా చేస్తూ వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఉంటారు. అలా ఈ సంవత్సరం ఒక వంటకం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది.

ఆ వంటకం క్లౌడ్ బ్రెడ్. ఇది చూడటానికి బ్రెడ్ మాదిరిగా ఉన్న రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నార్మల్ గా గోధుమ రంగు, తెలుపు రంగుతో కూడిన బ్రెడ్ లను తింటూ ఉంటాం. క్లౌడ్ బ్రెడ్ రుచిలోనే కాకుండా రంగులో కూడా మార్పు ఉంటుంది. ఈ బ్రెడ్ కి క్లౌడ్ బ్రెడ్ అని పేరు రావటానికి ఒక కారణం ఉంది.

ఈ బ్రెడ్ కొన్ని రంగుల తో ఉండగా… అవి చూడటానికి బ్రెడ్ పైన మేఘంలా కనిపిస్తుంది.అందుకే క్లౌడ్ బ్రెడ్ అని పేరు పెట్టారు.ఈ బ్రెడ్ తయారైన వెంటనే సోషల్ మీడియాలో బాగా వైరల్ వంటకంగా మారింది. ఈ బ్రెడ్ ని కోడుగుడ్డు సోనా, చక్కెర, మొక్కజొన్న పిండి( కార్న్ ఫ్లోర్), ఫుడ్ కలర్ ఇలా నాలుగు ఇంగ్రిడియన్స్ తో చేసుకోవచ్చు. దీనికి సంబందించిన వీడియోలు యూట్యూబ్ లో కూడా చాలానే ఉన్నాయి.