MoviesTollywood news in telugu

2021 లో ఎన్ని సినిమాలు సందడి చేయనున్నాయో చూడండి

Movies To Be Released In 2021 : కరోనా దెబ్బతో 2020లో ఎన్నో సినిమాలు దెబ్బతిన్నాయి. అందరి ఆశలు అడియాసలయ్యాయి. విడుదలకు నోచుకోవాల్సిన సినిమాలు ఆగిపోయాయి. భారీ సినిమాలు జాప్యం అయ్యాయి. దీంతో 2021పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 10భారీ మూవీస్ విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, లతో పాటు సంచలన మూవీ కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

కేజేఎఫ్ విజయంతో అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కెజిఎఫ్ 2మొదలుపెట్టారు. బాహుబలి 2తర్వాత అంతటి స్థాయిలో కెజిఎఫ్ 2కోసం జనం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రాబోతున్న కెజిఎఫ్ 2పై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీపై ఫాన్స్ లో భారీ అంచాలున్నాయి. రామ్ చరణ్ కూడా పవర్ ఫుల్ పాత్రలో కన్పించనున్న ఈ సినిమా 2021లో రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ పై కూడా ఫాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీ ఇప్పటికే 140కోట్ల బిజినెస్ చేస్తోంది. దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనా లున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా తీస్తున్న రాధేశ్యామ్ పై కూడా భారీ అంచనాలు న్నాయి. ఇక బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న టక్ జగదీశ్ గురించి ఎక్కువ అంచనాలున్నాయి. శేఖర్ కమ్ముల తీస్తున్న లవ్ స్టోరీ కూడా 35కోట్లకు పైగా సాగుతోందని టాక్. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ మూవీ పై కూడా భారీ క్రేజ్ ఉంది. శ్యాం సింగరాయ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.