సమంత వేసుకున్న బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే

samantha Hand Bag Price :అక్కినేని కోడలు సమంత స్టార్ హీరోయిన్ గా సినిమాల్లో బిజీగా ఉండడమే కాదు, డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పై హోస్ట్ గా చేస్తూ, వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. హీరోయిన్స్ సంపాదనకు తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుంది. ఖరీదైన వాటిని కొనుగోలు చేస్తూ తమ వెరైటీ చాటుకుంటారు. అలాగే సమంత కూడా బ్రాండెండ్ వస్తువులు బాగానే వాడుతుంది. అయితే ఆమె ఉపయోగిస్తున్న బ్రాండెడ్ వస్తువుల ధర తెలిసి ఫాన్స్ కూడా వాపోతున్నారు.

తాజాగా ఎయిర్ పోర్ట్ లో వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిసి ఆమె ఫాన్స్ కూడా వావ్ అంటున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మెరిసిన సమంత ఉపయోగిస్తున్న మోనోగ్రామ్ బ్యాగ్ ధర ఏకంగా 2 లక్షల 20 వేల రూపాయలని తెలుస్తోంది. సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు 10వేల రూపాయలని, ఆమె పట్టుకున్న సూట్ కేసు ధర 1,87,000 రూపాయలని టాక్ . ఇక డ్రెస్ కు మ్యాచ్ అయ్యే మాస్క్ ను ధరించడం మరో విశేషం.

ఇక తాజాగా పౌరాణిక పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తనకంటూ మరో ప్రత్యేక గుర్తింపు సమంత తెచ్చేసుకుంది. రుద్రమదేవి సినిమా తరువాత డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాకు టైటిల్ రోల్ కి సామ్ సెలెక్ట్ అయింది. నిజానికి శకుంతల పాత్రకు పూజా హెగ్డే ఫైనలైజ్ అయినట్లు ప్రచారం అయింది. అయితే చివరకు ఆ పాత్రకు సమంత ను వరించింది. కాగా దుశ్యంతుడి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.