ఎమ్మెల్యే రోజా కూతురు టాలెంట్ మామూలు రేంజ్ లో లేదట…ఏమిటో?

Telugu actress Roja :రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వైసిపి ఎమ్మెల్యే రోజా ఒకప్పుడు ముద్దుగుమ్మల ఒయ్యారాలు ఒలకబోస్తూ అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈమె కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే దర్శకుడు సెల్వమణితో పెళ్లయింది. వీళ్లకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. రోజా కూతురు పేరు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజాలో మంచి నటి ఉంటె, ఆమె కూతురు అన్షుమాలికలో మంచి రచయిత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, షిప్పింగ్ పర్షిప్షన్ అనే పుస్తకాన్ని అన్షుమాలిక రాసింది.

ఈ పుస్తకం అద్భుతంగా, అనుభవం ఉన్న రచయిత్రిలా రాసినట్లు ప్రచురణకర్తలు అభిప్రాయపడటం విశేషం. ప్రస్తుతం అన్షుమాలిక చెన్నైలోని ప్రముఖ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. తల్లి రాజకీయనాయకురాలిగా, తండ్రి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటే అన్షుమాలిక మాత్రం వారికి భిన్నంగా రచయిత్రిగా సత్తా చాటుతోంది. ఇదంతా చూస్తుంటే, అన్షుమాలిక భవిష్యత్తులో రచయిత్రిగా కూడా రాణిస్తారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి తల్లిలా అన్షుమాలిక కూడా భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

ఇక రోజా విషయానికి వస్తే, ప్రస్తుతంసినిమాలకు కొంత దూరంగానే ఉన్నా, ఈటీవీ జబర్దస్త్ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ తరపున రెండుసార్లు నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీ దక్కించుకున్నారు. అంతేకాదు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కుతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం విశేషం. అయితే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ లో మార్పు లుంటాయని సీఎం జగన్ చెప్పడంతో రోజాకు కేబినేట్ లో బెర్త్ ఖాయమంటున్నారు.