రకుల్ కి ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుసా?

Rakul favorite food :రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు బ్రూస్లీ సినిమా బ్రేక్ ఇచ్చింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్లీ పెద్దగా హిట్ కాకపోయిన ఈ అమ్మడికి మంచి అవకాశాలను తెచ్చిపెట్టి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది.

ఫిజిక్ విషయంలో రకుల్‌ను చూస్తుంటే మిగిలిన హీరోయిన్లకు కుళ్లు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే రకుల్ అంతలా మెయిన్ టైన్ చేస్తుంది. రోజుకి దాదాపుగా నాలుగు గంటల పాటు జిమ్ చేస్తుంది. రకుల్ మిగిలిన హీరోయిన్ ల కాకుండా తనకు నచ్చిన ఫుడ్ తింటూ జిమ్ చేసేస్తుంది.

నచ్చిన ఫుడ్ ని అసలు వదలదు రకుల్. ఈ అమ్మడికి గులాబ్ జామూన్, ఆలూ పరాట అంటే చాలా ఇష్టమట .ఇవి కనపడితే అసలు ఆగకుండా తినేస్తుందట. చేతిలో సినిమాలతో చాలా బిజీగా ఉంది రకుల్.