రవితేజ క్రాక్ సినిమా మొదటి వారం కలెక్షన్…ఎన్ని కోట్లో …?

Ravi Teja Krack 1st Week collections : రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఈ నెల 9 వ తేదీన విడుదల అయ్యి మొదటి రోజు నుంచే కలెక్షన్ బాగుంది. కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి). దూకుడు అలా కొనసుగుతూనే ఉంది.

మాస్ మహారాజ్ తన స్టామినా ఏమిటో చూపించాడు. సంక్రాంతి రేసులో ముందు ఉన్నాడు. క్రాక్ సినిమా వారం రోజుల కలెక్షన్ 21 కోట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి. అదే 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే కనుక రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అయ్యేది.