Healthhealth tips in telugu

పొడి దగ్గు తగ్గాలంటే ఈ టీ ట్రై చేయండి…Best Tip

Tulsi tea benefits :ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో పొడి దగ్గు అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది పొడి దగ్గు వచ్చింది అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఈ కాలంలో చలి మంచు రెండు ఎక్కువగానే ఉన్నాయి వీటి కారణంగా పొడి దగ్గు వస్తుంది. మనలో చాలా మంది పొడిదగ్గు రాగానే టాబ్లెట్స్ టానిక్ అంటూ వాటి వైపు వెళ్ళి పోతూ ఉంటారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉండే తులసి ఆకులతో చెక్ పెట్టవచ్చు తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఉపశమనం కలుగుతుంది.

అయితే తులసి టీ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క 2 మిరియాలు పొడి చేసి వేయాలి బాగా మరిగించి వడకట్టి తాగాలి. రోజులో రెండు సార్లు ఈ టీ తాగితే పొడి దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది ఈ టీ తాగడం వలన డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.అలాగే డిప్రెషన్, ఒత్త‌డి, ఆందోళ‌న‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ తుల‌సి టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."