సూపర్ స్టార్ అందం వెనుక అసలు కారణం ఆమె…ఎవరో తెలుసా?
Mahesh Babu :సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రిన్స్ మహేష్ బాబు తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ అయ్యాడు. వరుస విజయాలను అందుకుంటూ వెళ్లడమే కాదు, వయస్సు పెరుగుతున్నా అందం మరింత పెరుగుతోంది. అదీ సూపర్ స్టార్ మహేష్ స్పెషాల్టీ. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్ కూడా హీరో అనిపించుకుంటున్నాడు. గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో చేయడానికి సిద్ధం అవుతు న్నాడు.
ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో కనిపించబోతున్నాడు మహేష్ సరసన కీర్తి సురేష్ తొలిసారిగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక మహేష్ అందానికి టాలీవుడ్ లోనే కూడా మిగిలిన చోట్ల కూడా అభిమానులు ఉన్నారు. దేవుడు ఛాన్స్ ఇస్తే మహేష్ లాంటి అందం కావాలని కోరుకుంటామని ఎంతోమంది హీరోలు కూడా ఇప్పటికే చెప్పేశారు.
అయితే సూపర్‌స్టార్ ఇంత అందంగా కనిపించడానికి సీక్రెట్ ఉందని అంటారు. తన అందం వెనుక ఎవరు ఉన్నారో అనే విషయాన్ని తాజాగా మహేష్ వెల్లడించాడు. అదెలా అంటే, తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటోను షేర్ చేసిన మహేష్ బాబు మై స్కిన్ స్పెషలిస్ట్ అని కామెంట్ పెట్టారు. కాగా మహేష్ అందానికి కారణమైన డాక్టర్ కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి. డెర్మటాలజిస్ట్‌గా మంచి పేరున్న ఈమె ప్రస్తుతం ముంబయిలో పలువురు సెలబ్రిటీలకు డెర్మటాలజిస్ట్‌గా ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఆమె పర్సనల్ డెర్మటాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారట.