ప్రదీప్ ఆరోగ్యం పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

30 rojullo preminchadam ela :బుల్లితెరపై టాప్ యాంకర్ గా ప్రదీప్ కొనసాగుతున్నాడు. రేడియో జాకీ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో ద్వారా మంచి గుర్తింపు పొందాడు. అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం పాట బాగా పాపులర్ అయింది ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా వచ్చిన సుడిగాలి సుదీర్ ప్రదీప్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రదీప్ చాలా కష్టపడ్డాడని… సినిమా హిట్ కావాలని చెప్పాడు అంతేకాకుండా తనకున్న అనారోగ్య సమస్య కారణంగా ఎక్కువసేపు కూర్చోలేడు. అయినా తన బాధను తనలోనే ఉంచుకుని అందరికీ సంతోషాన్ని పంచుతాడు అని సుధీర్ కాస్త ఎమోషన్ అయ్యాడు.