ఖిలాడీ మూవీకి రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

khiladi movie remunration : మాస్ మహారాజ్ క్రాక్ సినిమా హిట్ కావటంతో మంచి జోష్ లో ఉన్నాడు. రాజా ది గ్రేట్ సినిమా తరువాత సరైన హిట్ లేని రవితేజ క్రాక్ సినిమాతో 2021 లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రవితేజ ఒక్కో సినిమాకి 10 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. అయితే క్రాక్ సినిమా హిట్ తో పారితోషికాన్ని పెంచాడట.

ఇప్పుడు రవితేజ కొత్త సినిమా ఖిలాడీకి 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చోదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. క్రాక్ సినిమా హిట్ కావడంతో ఖిలాడీ సినిమా బిజినెస్ కూడా భారీస్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఖిలాడీ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఇంకో సినిమా కమిట్ కాలేదు. బాగా ఆలోచించి సినిమాలను ఒప్పుకుంటున్నాడు.