షాకింగ్ నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి

Telugu actress sai pallavi :కొందరు హీరోయిన్స్ భేషజాలకు పోతారేమోగానీ కొందరు పాత్ర, యాక్షన్ పార్ట్ చూసుకుని ఓ మెట్టు దిగడానికి సిద్ధపడతారు. ఎవరి పక్కనైనా నటించడానికి వెనుకాడరు. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన సినిమాలో బాబూమోహన్ సరసన సాంగ్ చేయడానికి సౌందర్య వెనుకాడలేదు. పైగా ఆ సాంగ్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రౌడీ బేబీ సాయిపల్లవి అదే చేస్తోంది.

కెరీర్ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ, తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమాతో పరిచయమై, తొలి సినిమాతో తనదైన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఈ అమ్మడు ఆకట్టుకుంది. కమర్షియల్‌ సినిమాల్లోనే నటిస్తానని హీరోయిన్స్‌ అనుకుంటున్న సమయంలో సాయిపల్లవి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలకే ఓటు వేస్తూ నటిస్తూ వచ్చింది. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. తమిళంలో కామెడీ పాత్రలు చేసే నటుడు కాళి వెంకట్‌తో సాయిపల్లవి జోడీ కట్టబోతుందని దాని సారాంశం.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్న ఈ సినిమా కథ, పాత్ర నచ్చడంతో సాయిపల్లవి కూడా కాళి వెంకట్‌ సరసన నటించడానికి ఒకే చెబుతుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ స్టార్‌ హీరోయిన్‌ కమెడియన్‌తో జోడీ కట్టడమనేది సాధారణమే నని తమిళ తంబీలు గుర్తుచేస్తూ, సాయిపల్లవి ని అభినందిస్తున్నారట. జయా పజయాలు కాకుండా విభిన్న ‌ సినిమాలు చేయాలనే సాయి పల్లవి ఆలోచనే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. అందుకే వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.