జెడి చక్రవర్తి వైఫ్ కూడా హీరోయిన్ అని మీకు తెలుసా ?

jd chakravarthy wife :జె.డి. చక్రవర్తి … ఈపేరు వినగానే మంచి నటుడు మన కళ్ళ ముందు మెదులుతాడు.అలాగే ఓ డైరెక్టర్, నిర్మాత కూడా కనిపిస్తాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోయి నటించడంలో దిట్ట. ఇంతకీ చక్రవర్తి కూడా వర్మ స్కూల్ నుంచి వచ్చినవాడే. ఎందుకంటే వర్మ డైరెక్ష న్ లో 1989 లో వచ్చిన శివ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తర్వాత నేటి సిద్ధార్థ, శ్రీవారి చిందులు, అతిరథుడు, రక్షణ, ఆదర్శం ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. వర్మ శిష్యుడు శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన మనీ మూవీతో జెడి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువయ్యాడు.

ఇక మనీ మనీ, గులాబి, అనగనగా ఒక రోజు, దెయ్యం , బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా.. వంటి సినిమాల్లో నటించాడు. 1998 లో వచ్చిన సత్య సినిమా, జె.డి.చక్రవర్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. జెడి చక్రవర్తి తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. అలాగే మనీ మనీ మోర్ మనీ, సిద్ధం, డర్నా జరూరీ హై, దర్వాజా బంద్ రఖో, హోమం, దుర్గ, ఆల్ ది బెస్ట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

పాపే నా ప్రాణం సినిమా కూడా జెడి నిర్మించాడు. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే, 2016 లో జె.డి.చక్రవర్తి, లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ శర్మని వివాహం చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన శ్రీదేవి సినిమాలో అనుకృతి నటించింది. పైగా ఈ సినిమాకి జె.డి.చక్రవర్తి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదట. కానీ వీరిద్దరూ ఒకటయ్యారు.