అల్లరి నరేష్ కెరీర్ లో చేసిన తప్పులు ఏమిటో తెలుసా?

Allari naresh movies :దూసుకు పోయినంతకాలం సినిమా పరిశ్రమలో ఢోకా ఉండదు. సక్సెస్ ఉన్నన్నాళ్ళు ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళు, సక్సెస్ లేకుంటే దరిదాపులకు కూడా రారు. సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వ సాధారణం. ఇప్పుడు అల్లరి నరేష్ ఇలాగే దెబ్బతిన్నాడు. ఒకప్పుడు కోటి రూపాయలతో మూవీ తీస్తే, 15కోట్లు కలెక్షన్స్ తెచ్చిన అల్లరి నరేశ్ కి సక్సెస్ లు లేకపోయేసరికి మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది.

ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లరి నరేష్ కామెడీ సినిమాలతో జనానికి బాగా చేరువయ్యాడు. ఎన్నో హిట్స్ అందుకున్నాడు. వరుసగా 5హిట్స్ కొట్టినప్పటికీ ఒక్క ఫెయిల్యూర్ తో ఇండస్ట్రీ ఇతడిని పక్కన పెట్టేసింది. సుడిగాడు తర్వాత ఈ 8ఏళ్లకాలంలో 15మూవీస్ చేసి కూడా సక్సెస్ బాట పట్టలేక వెనుకబడ్డాడు. అయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే ఉన్నాడు. కానీ అతడిలో గొప్ప నటుడు దాగిఉన్న కామెడీ ఫార్ములాకు పరిమితం అయిపోయాడు. అందుకే ఇన్నాళ్లూ వెనుకబడ్డాడు.

అందుకే ఇప్పుడు ఓ కథ వచ్చింది. శతమానం భవతి లాంటి సినిమాలు తీసిన సతీష్ వేగేశ్న ఈ మూవీ తీయడానికి ముందుకు రావడంతో ‘నాంది’మూవీ పట్టాలెక్కింది. చాలామందికి ఈ సినిమాపై నమ్మకమే లేదు. ట్రైలర్ చూసి, నగ్నంగా ఉన్నాడేంటి అని వెటకారించారు. టీజర్ వచ్చాక కాస్త ఆలోచలనలోపడ్డారు. సినిమా హిట్ కొట్టాక అందరూ పొగడ్తలు మొదలెట్టేసాడు. సక్సెస్ చూసి 8ఏఏళ్ళు అయిపోయిందని నరేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రాణం మూవీలో శివుడు, నేనులో వినోద్, విశాఖ ఎక్స్ ప్రెస్ లో రవివర్మ, గమ్యంలో గాలి శ్రీను, శంభో శివశంభోలో మల్లి పాత్రల ద్వారా అల్లరి నటేష్ తన లోని నటుడు ఎలా ఉంటాడో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికైనా నరేష్ తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటే నాంది లాంటి విజయాలు వస్తాయి.