కెజిఎఫ్ లో హీరో యశ్ తల్లిగా నటించిన ఆమె వయస్సెంతో తెలుసా ?

KGF Movie Mother Archana Jois :కన్నడంలోనే కాదు యావత్ భారతంలోనే కెజిఎఫ్ మూవీ ఓ సంచలనం. అన్ని భాషల్లో హిట్ కొట్టేసింది. అందుకే హీరో యష్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. అది కాస్తా కెజిఎఫ్ 2తీయడానికి యష్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఛాన్స్ వచ్చింది.

తెలుగులో బాహుబలి అన్ని భాషల్లో ఎలా విజయాన్ని అందుకుని వరల్డ్ వైడ్ పేరు తెచ్చుకుందో ఆ రేంజ్ లో ఓ కన్నడ సినిమా ఎదగడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దక్షిణాదికి గర్వకారణం అయింది. అందరికీ పేరు వచ్చినట్లుగానే కెజిఎఫ్ లో హీరో యష్ కి తల్లిగా నటించిన ఆమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

సాధారణంగా మదర్ క్యారెక్టర్స్ కి వయస్సు మళ్లినవాళ్లను , సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినవాళ్లను తీసుకుంటారు. మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న అర్చన వయస్సు కేవలం 26ఏళ్ళు. యష్ హీరోగా నటించడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. కానీ డైరెక్టర్ ఈ అమ్మాయిని తీసుకుని హీరోకి తల్లిగా చేయించి సక్సెస్ అయ్యాడు. అందుకే అందరూ ఆమె వయస్సు తెల్సి ఆశ్చర్యపోతున్నారు.