కరీనా కపూర్ పనిమనిషి జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

kareena kapoor housemaid salary :ఒకప్పుడు జమీందారుల ఇళ్లల్లో నౌకర్లు , చాకర్లు ఉండేవారు. కానీ ఇప్ప్పుడు సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలే కాదు, భార్యాభర్తలిద్దరూ సంపాదన పరులైతే తమ ఇంట్లో బాగోగులు, ముఖ్యంగా పిల్లల ఆలనా పాలనా చూసేందుకు మనుషులను పెట్టుకుంటున్నారు. ఇది సర్వ సాధారణం అయిపొయింది. అయితే వాళ్ళకిచ్చే జీతాలు వాళ్ళ స్తోమతను బట్టి ఉంటాయి. తమ రేంజ్ కి తగ్గ రీతిలో మనుషులను జీతాలకు కుదుర్చుకుంటారు.

ఇక సెలబ్రిటీలు ముఖ్యంగా హీరో హీరోయిన్స్ గా బిజీగా ఉన్నవాళ్ళ ఇళ్లల్లో పెట్టుకునే మనుషుల కోసం ఎన్నో ఇంటర్యూలు చేసి మరీ మనుషులను పెట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే, ఫిబ్రవరి 21 న మగబిడ్డకు బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ జన్మనిచ్చింది.

ఇది సహజ విషయమే. కానీ కరీనాకపూర్ పెట్టుకున్న ఆయా గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అయింది. కరీనాకపూర్ లాంటి వాళ్లకు ఆయాలు కావాలంటే అతి పెద్ద ఏజెన్సీలు సరఫరా చేస్తుంటాయి.

అయితే ఇలా పెట్టుకున్న ఆయాకు కరీనాకపూర్ ఏకంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇస్తుందట. అదేకాదండోయ్ ముంబైలో తిరగడానికి ఒక కారు, విదేశీట్రిప్స్ ఛాన్స్ లు కూడా కల్పిస్తారు. ఇవన్నీ కలిపితే, ఒక లక్ష 75 వేలు. ఇది 2018నాటి మాట. దీన్ని బట్టి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సెలెబ్రెటీలతో వ్యవహారం అందునా అనుక్షణం పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే, మరింత వ్యాప్తి చెందకుండా చూస్తూ, అనారోగ్య సమస్యలు తొలిగి పోయేలా చూసుకోవాలి. అందుకే ఆయాల కోసం ఎంతైనా వెచ్చిస్తారు.