ఉప్పెన రీమేక్ కోసం యమ గిరాకీ…డిమాండ్ మామూలుగా లేదుగా

Uppena Movie :క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తొలిసారిగా తెరకెక్కించిన “ఉప్పెన” చిత్రానికి అనూహ్య స్పందన వచ్చేసింది. పేరుకు తగ్గట్టే వసూళ్లు కూడా ఉప్పెనలా వస్తున్నాయి.మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ , కృతి శెట్టి జంగగా నటించిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేసాడు. వైష్ణవ తేజ్, కృతి శెట్టి న్యూ ఎంట్రీతో మంచి పేరు కొట్టేసారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదరగొట్టేసింది. ఇక కరోనా సమయంలో దెబ్బతిన్న ఇండస్ట్రీకి మళ్ళీ ప్రాణం పోసిందని ఉప్పెన విజయోత్సవ సభలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పాడు.

అయితే ఈ మూవీ రీమేక్ హక్కుల గురించి తాజాగా సోషల్ మీడియాలో పలు విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. హిందీ రీమేక్ చిత్రంలో హీరోగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నటించబోతున్నట్లు, తమిళంలో రీమేక్ చేసేందుకు ఇప్పటికే తమిళ డిజిటల్ రీమేక్ హక్కులను కూడా విజయ్ సేతుపతి కొనేసాడని టాక్. మరోవైపు తమిళ్ తలైవా విజయ్ కొడుకు సంజయ్ విజయ్ హీరోగా నటించేలా రీమేక్ హక్కులు కొన్నాడని టాక్. అయితే సంజయ్ ఇతర దేశాల్లో నటన కోర్సులను అభ్యసిస్తున్నందున ఇప్పట్లో నటించకపోవచ్చని మరో టాక్.