బిగ్ బాస్ అఖిల్ కొన్న కారు ఖరీదు ఎంతో తెలుసా?

Bigg Boss Akhil :కారు కొనడం ఈరోజుల్లో పెద్ద పనేం కాదు, కొంత సొమ్ము కడితే వాయిదాల పద్ధతిలో తమకు కావాల్సిన కారుని ఇవ్వడానికి ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. బజాజ్ లాంటి సంస్థలూ ఉన్నాయి. అయితే సొంతంగా డబ్బుపెట్టి కారు కొనాలంటే ఓ రేంజ్ ఉండాలి. అదేనండి తగిన ఆర్ధిక స్థోమత ఉండాలి. అయితే ఈమధ్య బుల్లితెర మీద వస్తున్న జబర్దస్ కామెడీ షో, బిగ్ బాస్ రియాలిటీ షో వంటి వాటిలో పాల్గొంటున్న వాళ్ళ ఆర్ధిక స్థితి మెరుగుపడి, కార్లు, ఇళ్ళు , పొలాలు కొనేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి ఖరీదైన కారుతో పాటు ఇల్లు కూడా కొనేసింది. బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ నుంచి బయటకు వచ్చిన లాస్య, సోహెల్ కూడా ఈ మధ్య కాలంలో కారు కొనుగోలు చేయగా, అదే హౌస్ లో పాల్గొన్న అఖిల్ తాజాగా కారు కొనేసాడు.

బిగ్ బాస్ షో రన్నరప్ గా నిలిచిన అఖిల్ తన రెమ్యునరేషన్ లో కారుకోసం కొంత మొత్తం అంటే ఏకంగా 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసినట్లు టాక్. హోండా కంపెనీ మోడల్ కారును కొనుగోలు చేసిన అఖిల్ తన కల నిజమైందని చెప్పుకొచ్చాడు. దీంతో అఖిల్ కి మోనాల్, సోహెల్ తో పాటు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు విషెష్ చెప్పారు.