రవి కృష్ణతో ప్రేమ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవ్య స్వామి

Ravi Krishna- Navya Swamy :బుల్లితెరలో రవికృష్ణ నవ్య స్వామి ప్రేమ లో ఉన్నట్టు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఆమె కథ సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో వీరిద్దరికీ పెళ్లి కూడా చేసేశారు ఈ షోలో కొంచెం చనువుగా కనిపించేసరికి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే ఊహాగానాలు వచ్చాయి అంతేకాకుండా ఆ మధ్య క్యాష్ షో లో కూడా వీరు రొమాన్స్ చేశారు.

దాంతో అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వైరల్ చేశారు. ఈ విషయంపై నవ్య స్వామి క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం కేవలం స్నేహితులమని ఇటువంటి రూమర్స్ ని ఎప్పుడూ పట్టించుకోనని చెప్పారు. రవి కృష్ణ తో మంచి కోఆర్డినేషన్ ఉందని అది వృత్తి వరకు మాత్రమే అని తను,రవి కృష్ణ మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది. గతంలో కూడా హిట్ ఫెయిర్ లకు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ సహజమే అని చెప్పుకొచ్చింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టానని అసలు ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో అంటూ వాపోయింది.