బంగారు పంజరం సీరియల్ యాక్టర్ రాజాబాబు ఎన్ని సినిమాల్లో నటించాడో…?

Bangaru panjaram serial actor raja babu :సినిమాలతో ధీటుగా దూసుకెళ్తున్న సీరియల్స్ కి ఎనలేని క్రేజ్ వుంది. ఇక ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న బంగారు పంజరం సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచి టిఆర్పి రేటింగ్ ఉంది. ఇందులోని నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు.

ఇందులో నటిస్తున్న రాజాబాబు తన అందంతో , అభినయంతో ఆకట్టుకుంటున్నాడు. అమ్మాపురంలోనే పుట్టి పెరిగిన రాజాబాబు అసలుపేరు సత్య. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో నాపేరు మీనాక్షి సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. బలరాం గా నెగెటివ్ రోల్ పోషించి మెప్పించాడు. ఆ సీరియల్ లో బెస్ట్ విలన్ గా అవార్డు తెచ్చుకున్నాడు

ఆ తర్వాత ముద్దమందారం, సూర్యవంశం, రాజారాణి వంటి సీరియల్స్ లోసత్య నటించాడు. కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద కూడా మెరిసి ఆడియన్స్ ని మెప్పించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బాహుబలి వంటి సినిమా ల్లో చేసాడు. అయితే సినిమా నటుడి కన్నా సీరియల్ యాక్టర్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.