MoviesTollywood news in telugu

143 హీరోయిన్ గుర్తు ఉందా….ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood heroine sameeksha :ఇండస్ట్రీలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి. కొందరిని అదృష్టం వరిస్తే, మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. బాలీవుడ్ బ్యూటీ ‘సమీక్ష’ తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 143 మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, మంచి హిట్ కొట్టేసింది. తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం తదితర భాషలలో సినిమా ఛాన్స్ లు కూడా దక్కించుకుంది. అయితే ఇందులో చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తేడా కొట్టింది.

అయితే తెలుగులో చివరిగా సమీక్ష టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ భుయాన్ డైరెక్ట్ చేసిన దడ చిత్రంలో అక్కినేని హీరో నాగ చైతన్య వదిన పాత్రలో మెరిసింది. అదీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అంతేగాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధపడి, ఆ మధ్య పలు తెలుగు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది. తర్వాత నుంచి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనిపించలేదు.

అయితే ఈ అమ్మడికి తెలుగులో ఛాన్స్ లు రాకపోయినా, పంజాబీ భాషలో మాత్రం వరుస సినిమాలతో బాగానే అలరిస్తోంది. కాగా ప్రస్తుతం నటి సమీక్ష శైల్ ఓస్వల్ అనే ఓ ప్రముఖ సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా లోని ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. ఇంతలోనే వీరిద్దరు సింగపూర్ లో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకోవడంతో సినిమాలను వదిలేసి, వ్యాపారాలపై ఈ భామ దృష్టి పెట్టింది.