భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాకర్
TV actor Prabhakar :బిగ్ స్క్రీన్ పై సినిమా హీరోలకు మించిన క్రేజ్ స్మాల్ స్క్రీన్ పై నటించే నటీనటులకు క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. అందుకే ధారావాహికంగా వచ్చే సీరియల్స్ కి విశేష ఆదరణ ,అందులో నటించే నటీనటులు రోజూ కన్పించడం వలన ఇంట్లో మనుషులుగా ట్రీట్ చేస్తుంటారు. అందుకే టివి నటీనటులకు కూడా మంచి డిమాండుంది.
వెండితెరను ఏలినట్టే కొందరు బుల్లితెరను ఏలేస్తున్నారు. అందులో నటుడు ప్రభాకర్ ఒకడు. ఇతడికి గల క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండదు. యాహూ షోతో పాపులర్ అయిన ప్రభాకర్.. ఆ తర్వాత ఈటీవీలో సుమన్‌తో స్నేహం వల్ల స్టార్ గా మారిపోయి,అంచెలంచెలుగా ఎదిగి బుల్లితెరపై మెగాస్టార్ గా రూపాంతరం చెందాడు.
సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, ఆపరేషన్ ధుర్యోధన లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై వరస సీరియల్స్ చేస్తూ బిజీ గా మారిపోయిన ప్రభాకర్ ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో చేస్తున్నాడు. ఇది బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో నడుస్తోంది.
ప్రభాకర్ పలు ఇంటర్యూలు కూడా ఇచ్చే క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రభాకర్ చెప్పుకొచ్చాడు. తన భార్య గురించి వివరిస్తూ, తన డిగ్రీ క్లాస్ మేట్ మళయజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని, తనను స్క్రీన్ పై వేరే అమ్మాయిలతో చూసి భార్య బాధ పడుతూ ఉండేదని చెప్పాడు.
అలాంటి సమయంలో తాను ఇంట్లో పవర్ కట్ చేయడం.. లేదంటే ఆ సీన్స్ వచ్చే సమయంలో సినిమాకు తీసుకెళ్లడం లాంటివి చేసేవాడినని ప్రభాకర్ తెల్పాడు. ఆ తర్వాత షూటింగ్ లో ఎలా జరుగుతుందో చెప్పడంతో పాటు నటీనటుల మధ్య ఏ విధమైన సంబంధం ఉండదని చెప్పడానికి ఆమెను షూటింగ్‌లకు కూడా తీసుకెళ్లేవాడినని, దాంతో ఆమె కూడా అర్థం చేసుకుందని, దాంతో అక్కడ మనం చూసేదంతా నటన అంటూ ఫిక్స్ అయిపోయిందని ప్రభాకర్ వివరించాడు.
అప్పట్లో తనకు ఓ అమ్మాయితో సంబంధం ఉండేదని వార్తలు వచ్చిన సమయంలో తనకు భార్య అండగా నిలిచిందని ఎమోషనల్ అయ్యాడు. ఈటివి సుమన్ బతికున్నపుడు ఈటీవీ క్రియేటివ్ మేనేజర్‌గా, ఈటీవీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగి, తరవాత బయటకు వచ్చేసిన ప్రభాకర్ ‘మా’ టీవీ తో పాటు మిగిలిన ఛానెల్స్‌లో కూడా సత్తా చాటుతున్నాడు.