యాంకర్ సుమ కెరీర్ లో ఎదురు దెబ్బలు…నమ్మకం లేదా…?

Anchor Suma kanakala :అందరిలాగే యాంకర్ సుమ కూడా తన కెరీర్ లో ఎన్నో ఎదురు దెబ్బలు, ఒడిదుడుకులు ఎదుర్కొని టివి రంగంలో నిలదొక్కుకుని స్టార్ యాంకర్ అయింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వివిధ టివి షోస్ చేస్తూ ఎప్పటికప్పుడు తన కెరీర్ ని తీర్చిదిద్దుకుంటూ నెంబర్ వన్ పొజిషన్ కి చేరింది. కెరీర్ లో ఒడిదుడుకులు వచ్చి ఇబ్బందులు రావడం, అదే సమయంలో అదృష్టం కల్సి రావడంతో అందివచ్చిన ఛాన్స్ లను అందుకు అనుకూలంగా మలుచుకుంది.

సుమ 2004లో చేసిన అవాక్కయ్యారా షో సుమ కెరీర్ ని మలుపు తిప్పింది. అలాగే పట్టుకుంటే పట్టుచీర షో కూడా బ్రహ్మాండంగా క్లిక్ అయింది. ఇప్పటి జెమిన్ మూవీస్ ఒకప్పటి తేజా న్యూస్ ఛానల్ లో ఈ షో ప్రసారమైంది. ఈమె బయట ఎక్కడ కన్పించినా పట్టుచీర ప్లీజ్ అని సరదాగా అడిగేంతగా ఈ షో క్లిక్ అయింది. ఇక ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ సుమ కు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చేసింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వంటి సంగీత దిగ్గజాలు సాంగ్స్ పాడిన ఈటివి స్వరాభిషేకం షో కూడా సుమ కెరీర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లింది.

ఇక సుమకు పేరుతొ పాటు ఆర్ధికంగా కూడా లాభం చేకూర్చిన క్యాష్ ప్రోగ్రాం ఈటీవీలో ప్రసారమైంది. స్టార్ మా లో వచ్చిన భలే చాన్సులే షో కూడా సుమ కూడా మంచి పేరు తెచ్చింది. జీన్స్ షో కూడా బాగా ఆకట్టుకుంది. జి తెలుగులో వచ్చిన లక్కు కిక్కు, అలాగే ఎఫ్ 3షో కూడా మంచి పేరు తెచ్చాయి. వైఫ్ చేతిలో లైఫ్ షో కూడా మంచి పేరు తెచ్చింది. తన హావభావాలు, వాక్ చాతుర్యం తో బుల్లితెర ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది.