హీరో – డైరెక్టర్ హిట్ కాంబినేషన్ MOVIES చూడండి
Actors and Directors Best Combination in Tollywood :పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఇప్పటికీ టాప్. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి .. ఇలా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వీళ్ళ కాబినేషన్ కి క్రేజ్ ఉంది.
ఇక ప్రభాస్, రాజమౌళి కాంబో సంగతి చెప్పక్కర్లేదు. ఛత్రపతి ఆల్ టైం రికార్డ్ కాగా, బాహుబలి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది.
బ్రహ్మ, అసెంబ్లీ, రౌడీ, కలెక్టర్ గారు వంటి హిట్ మూవీస్ బి గోపాల్, మోహన్ బాబు కాంబోలో వచ్చాయి.
సుమన్,శరత్ కాంబోలో బావ బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు ఇలా పలు హిట్స్ ఉన్నాయి.
ఆఖరి పోరాటం, జానకి రాముడు, అన్నమయ్య ,శ్రీరామదాసు ఇలా కె రాఘవేంద్రరావు, నాగార్జున లది హిట్ కాంబినేషన్.
ఇక కలియుగ పాండవులు మూవీతో పరిచయం చేసిన వెంకటేష్ , రాఘవేంద్రరావు కాంబినేషన్ సూపర్. ముద్దుల ప్రియుడు, సుందరకాండ ఇలా మంచి హిట్స్ వచ్చాయి.
తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్ 2 హిట్ అవ్వడంతో ఎఫ్ 3పై క్రేజ్ పెరిగింది.
శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి కాంబోలో వినోదం, ఎగిరే పావురమా,పెళ్ళాం ఊరెళితే వంటి హిట్స్ తో ఆడియన్స్ లో క్రేజ్ సంపాదించారు.
అలాగే జగపతి బాబుతో ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో శుభలగ్నం, మావిచిగురు, అతడే ఒక సైన్యం వంటి హిట్స్ పడ్డాయి.
మహేష్ బాబు , పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్. బిజినెస్ మ్యాన్ తో ఇంకో హిట్ ఇచ్చి, మరోసినిమా ఇప్పుడా అని ఎదురుచూసేలా చేసారు.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి మూవీస్ సూపర్ హిట్
హీరో సూర్య, డైరెక్టర్ హరి కాంబోలో సింగం సీక్వెల్ సూపర్ హిట్.