MoviesTollywood news in telugu

రామానాయుడు, కృష్ణ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో…?

Krishna And Ramanaidu :స్త్రీ జన్మ మూవీతో సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీసిన మూవీ మొఘల్ మెగా ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు ఆతర్వాత నాలుగు చిత్రాలు తీశారు. స్త్రీ జన్మ మూవీలో ఎన్టీఆర్ తమ్ముడిగా కృష్ణ నటించాడు. ఆతర్వాత రామానాయుడు తీసిన పాపకు మూవీలో కృష్ణ అతిధి పాత్ర పోషించారు. ఇందులో ఒక పాటలో మాత్రమే కృష్ణ కనిపిస్తారు. రామానాయుడు భార్యగా, కృష్ణ కూతురిగా విజయనిర్మల నటించడం ఆసక్తికరం. తర్వాత బొమ్మలు చెప్పిన కథ మూవీలో కృష్ణ హీరోగా వేస్తె, అయన సరసన గీతాంజలి నటించింది. నాగభూషణం కూడా ఇందులో కీలక పాత్ర వేశారు.

ఇక 1978లో కృష్ణ 8 మూవీస్ లో నటించగా అందులో రామానాయుడు తీసిన సావాసగాళ్లు మూవీ ఒకటి. 12 లక్షలతో తీసిన ఈ సినిమా నిర్మాత రామానాయుడికి మంచి లాభాలు తెచ్చింది. అంతకు ముందు చిత్రాలకు భిన్నంగా ఇందులో కృష్ణ సాఫ్ట్ క్యారెక్టర్ వేసారు. ఇక కృష్ణ,శోభన్ బాబు కాంబోలో మండే గుండెలు మూవీ తీశారు. కృష్ణ సరసన జయప్రద, శోభన్ బాబు సరసన జయసుధ నటించారు. చంద్రమోహన్,మాధవి మరో జంట. కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఘనవిజయాన్ని అందుకుంది.

ఇక ఆతర్వాత ముందడుగు మూవీ కృష్ణ ,శోభన్ బాబు కాంబినేషన్ లో రామానాయుడు తీశారు. కృష్ణ సరసన జయప్రద, శోభన్ బాబు సరసన శ్రీదేవి నటించారు. బాపయ్య డైరెక్ట్ చేసిన ఈమూవీ గోల్డెన్ జూబ్లీ చేసుకున్న ఏకైక మల్టీస్టారర్ మూవీగా నిల్చింది. అయితే కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కృష్ణతో ఓ సినిమా తీయడానికి రామయ్యనాయుడు సిద్ధమవ్వడం, పరుచూరి బ్రదర్స్ కథ సిద్ధం చేయడం, షూటింగ్ ప్రారంభించే ముందు కురుక్షేత్రం నిర్మాత ఆంజనేయులును కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కృష్ణ చెప్పడంతో మరొకరితో కల్సి తీయడం ఇష్టం లేక దానికి బ్రేక్ పడింది. అప్పుడు వెంకటేష్ ని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తూ కలియుగ పాండవులు మూవీ రామానాయుడు తీశారు.

ఈ మూవీ 100డేస్ ఫంక్షన్ కి కృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చి, నేను సినిమా చేయకపోవడం వలన వెంకటేష్ అనే కొత్త నటుడు వచ్చాడు, ఈ క్రెడిట్ నాదే అంటూ చమత్కరించారు. అయితే 1999లో ఓ సినిమా కృష్ణతో తీయడానికి పోసాని కృష్ణ మురళీతో రామానాయుడు కథ రెడీ చేయించారు. ఎం ఎం శ్రీలేఖ మ్యూజిక్ లో కొన్ని సాంగ్స్ రికార్డ్ చేసారు. మహేష్ అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. అయితే అప్పటికే కృష్ణ సినిమాలకు మార్కెట్ దెబ్బతినడంతో సినిమా ఆగిపోయింది. ఆతర్వాత రవితేజా హీరోగా కృష్ణ నటించిన బలాదూర్ మూవీని రామానాయుడు సమర్పణలో సురేష్ బాబు నిర్మించారు.