18 ఏళ్ళు నిండిన వారికి మరో శుభవార్త

corona vaccine 18 Years : ఇటీవల కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తారీకు నుంచి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి టీకా అందిస్తున్నట్టు ప్రకటన చేసింది. మనదేశంలో యువత కారణంగా వైరస్ పెద్దవారికి సోకుతుందని ఈ నిర్ణయం తీసుకుంది

యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరి కారణంగా పెద్దవారికి కరోనా స్ప్రెడ్ అవుతుందని భావించి మే ఒకటో తారీకు నుండి కరోనా వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన వారికి కేంద్రం అందించనుంది. దీనికోసం cowin అనే యాప్ ద్వారా ఈనెల 28 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ సీఈవో ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. ఈ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్స్ గతంలో లాగానే ఉంటాయని చెప్పారు.