తేగలను ఇలా తీసుకుంటే ఈజీ గా బరువు తగ్గొచ్చు

Weight Loss Tips in telugu :తేగలు అనేవి తాటి పండు నుంచి వచ్చే ఉత్పత్తుల్లో ఒకటి. రోడ్డు పక్కన విరివిగా అమ్ముతూ ఉంటారు కొంతమంది వీటిని చాలా ఇష్టంగా తింటారు కొంతమంది తినడానికి ఇష్టపడరు అయితే ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ విషయం చాలా మందికి తెలియదు

తేగలలో విటమిన్ సి విటమిన్ బి పొటాషియం పాస్పరస్ క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి తేగలు బాగా సహాయపడతాయి. తేగలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండబెట్టి పిండిగా తయారు చేసుకోవాలి

ఈ పిండితో రొట్టెలు తయారు చేసుకుని తింటే బరువు తగ్గుతారు అలాగే తినాలని కోరిక కూడా తగ్గుతుంది దాంతో బరువు తగ్గుతారు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది రక్తహీనత సమస్యను కూడా తొలగిస్తుంది తేగలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి