సూపర్ స్టార్ కృష్ణ,సారధి స్టూడియోస్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో…?

హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ తో సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉంది. తొలిమూవీ తేనెమనసులు షూటింగ్ అక్కడే జరిగింది. ఆతర్వాత అమాయకుడు షూటింగ్ కోసం కృష్ణ అక్కడ అడుగుపెట్టాడు. ఎలాంటి పాత్ర ఇచ్చిన ధైర్యంగా పోషించే కృష్ణ హిందీలో రాజ్ కపూర్ నటించి తీసిన సినిమా ఆధారంగా రూపొందిన అమాయకుడు మూవీలో కూడా నటించారు.

యాక్షన్ చిత్రాలకు భిన్నంగా సాత్విక పాత్ర పోషించారు. కృష్ణను ప్రేమించిన ధనిక యువతి పాత్రలో జమున నటించింది. వీరి కాంబోలో వచ్చిన తొలిమూవీ ఇదే. హీరోయిన్ తండ్రి పాత్రలో గుమ్మడి, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో విజయలలిత నటించారు. సమాజం మూవీ తర్వాత దర్శకుడు అడ్డాల నారాయణరావుకు ఇది రెండో సినిమా.

ఇందులోని ఎల్ ఆర్ ఈశ్వరి ‘పట్నంలో శాలిబండ’ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. నిర్మాతలు హైదరాబాద్ వాళ్ళు కావడంతో ఎక్కువ షూటింగ్ సారధి స్టూడియోస్ లో తీశారు. బండి శంకర రావు స్వరపరిచిన ‘చందమామ రమ్మంది చూడు, ‘అటు మానుపు ఇటు నువ్వు ‘ సాంగ్స్ ఇప్పటికీ పాపులర్.