ఇంటిగుట్టు సీరియల్ లో అనుపమ పాత్రను రిజెక్ట్ చేసిన నటి

inti guttu serial :బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైన ఇంటిగుట్టు సీరియల్ లో నటిస్తున్న మీనా వాసు కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈమె సీరియల్ లో అనుపమ పాత్రను పోషించింది. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్ తో ఆకట్టుకున్న ఈమె దాదాపు ఆరేళ్ళు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

భర్త పెట్టె కష్టాలు అనుభవించే పాత్రలో బాగా జీవించిన అనుమప సూర్యవంశం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా సినిమాల్లో కూడా చేసింది. పండగ చేస్కో, స్టాలిన్, వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , జయంబు నిశ్చయంబురా, జనతా గ్యారేజ్ వంటి మూవీస్ లో చేసింది.

అయితే ఇంటిగట్టులో అనుమపను సెలక్ట్ చేసుకునే ముందు మాటీవీలో వదినమ్మ సీరియల్ లో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సుజితను అడిగారట. ఆమె వదినమ్మ సీరియల్ లో వదిన పాత్రలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె రిజెక్ట్ చేయటంతో అనుపమకు ఆ అవకాశం వచ్చింది.

సుజిత గంగోత్రి, తులసిదళం, సుందరకాండ వంటి 50సీరియల్స్ లో చేసింది. మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ పసివాడి ప్రాణం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి పెద్దయ్యాక పలు సినిమాల్లో చేసింది.