వరుణ్ సందేశ్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా…అసలు ఊహించరు

varun sandesh new movie :శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ తాజాగా తన కొత్త సినిమాకి సంబందించిన టైటిల్ ప్రకటించాడు. అది కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో రివీల్ చేశాడు. ఒక మంచి కథతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్లు పోస్ట్ లో పేర్కొన్నాడు. పైగా ఆ మూవీ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ‘ఇందువదన’ టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పాడు. ఏం.ఎస్.ఆర్ ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రాబోతుందని, చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో కమెడియన్ ధనరాజ్ తో సినిమా విశేషాలు షేర్ చేసుకున్నాడు. కాగా ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయినప్పటికీ అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నందున ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, అసలు మొదలవుతాయి లేదో కూడా చెప్పలేం. హ్యాపీడేస్ తర్వాత దిల్ రాజు నిర్మించిన కొత్త బంగారులోకం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో మరో యూత్ హీరోగా ఎదుగుతాడని అనుకుంటున్న సమయంలో అతడి సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తనకొచ్చిన ఇమేజ్ ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. అయితే వరుణ్ సందేశ్ తనతో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి వితికని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.అతను చివరిగా నువ్వు తోపురా అనే సినిమాలో క్యామియో రోల్ పోషించాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 3లో భార్యతో కలిసి వరుణ్ సందేశ్ పాపాల్గొన్నాడు. మొత్తానికి హీరోగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.