Healthhealth tips in telugu

కరోనాను Golden Milk తో చెక్ పెట్టవచ్చా…నిజం ఇదే

Golden Milk Benefits In Telugu :దాదాపుగా సంవత్సరం పైనుండి కరోనా అందర్నీ ఇబ్బందుల పాలు చేస్తోంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచే ఇంటి చిట్కాలు మరియు ఆయుర్వేద మందుల వైపు అడుగులు వేస్తున్నారు. డాక్టర్స్ కూడా అనేక సూచనలు చేస్తున్నారు అలాగే ఆహార నియమాలు గురించి కూడా చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెంచటానికి Golden Milk చాలా బాగా సహాయపడుతుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.

గోల్డెన్ మిల్క్ అంటే ఏమిటో అని అనుకుంటున్నారా అదేనండి పసుపు పాలు.మనం సాధారణంగా జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు పసుపు పాలు తాగుతూ ఉంటాం కదా. ఇప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి పసుపు పాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక గ్లాసు వేడి పాలలో రెండు చిటికెల పసుపును వేసి తాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ తాగుతూ ఉంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పసుపులో ఉన్న కర్క్యుమిన్ వంటి లక్షణాలు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి..