జబర్దస్త్ జడ్జి ఇంద్రజ అసలు పేరు ఏమిటో తెలుసా ?

Jabardasth Indraja : తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలతో జోడి కట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ అలీ వంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య వంటి సూపర్ స్టార్స్ వరకు అందరితో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు తమిళం మలయాళం భాషలలో దాదాపుగా 50 సినిమాలు చేసింది ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితం అయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇక ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో లో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రోజా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవటంతో ఆ స్థానంలో ఇంద్రజ వచ్చింది. జబర్దస్త్ లో కూడా మంచి జడ్జిమెంట్ తో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. 1978లో చెన్నైలో జన్మించిన ఇంద్రజ అసలు పేరు రాజాతి. సినిమాల్లో రావటానికి పేరు ఇంద్రజగా పేరు మార్చుకుంది. 15 సంవత్సరాల వయసులోనే తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది