MoviesTollywood news in telugu

రెబెల్ స్టార్ జీవితాన్ని మార్చేసిన 555 సిగరెట్ ప్యాకెట్…ఎలానో చూడండి

krishnam raju First Movie :సినిమా పరిశ్రమలో జరిగే పరిణామాలు వింతగా ఉంటాయి. ఎంతో శ్రమిస్తే గానీ సినిమా ఛాన్స్ రాదు, ఒకవేళ వచ్చినా కూడా చివరిక్షణంలో చేజారిపోతుంది. డూండి సమర్పణలో వి మధుసూదనరావు డైరెక్షన్ లో వీరాభిమన్యు మూవీ తీశారు. అర్జునుడి చుట్టూ తిరిగే పాత్ర ఇది. శ్రీకృష్ణుడుగా ఎన్టీఆర్ ఖరారు. ఇక అభిమన్యుడి పాత్ర కోసం చురుకైన కుర్రాడు కావాలని వేట ప్రారంభించారు. అంతకుముందు నర్తనశాల వంటి చిత్రాల్లో అభిమన్యుడిగా వేసిన హరనాధ్ ని తీసుకోవాలని డూండి చెబితే,కొత్త కుర్రాడిని పెడదాం అని మధుసూదనరావు అన్నారు.

ఒకసారి మద్రాసులోని ఆంధ్ర క్లబ్ కి వెళ్లిన డూండికి అక్కడ ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు కనిపించాడు. అతడు సినిమా వేషాల కోసమే ట్రై చేస్తున్నాడు. అయితే డూండి అతడి దగ్గరకు వెళ్లి మా సినిమాలో వేషం ఉంది రేపు వచ్చేయ్ అంటూ చేతిలో విజిటింగ్ కార్డు పెట్టారు. దాంతో ఆ కుర్రాడు అనుకున్న సమయానికి చెప్పిన చోటుకి వచ్చేసాడు. డూండి ఉన్నా, మధుసూదనరావు రాకపోవడంతో చేతిలో గల 555 సిగరెట్ ప్యాకెట్ తో అరగంటకోసారి బయటకు వెళ్లి ఓ దమ్ము లాగి రావడం చేసేవాడు. ఎంతకి రాకపోయేసరికి అలా బయటకు వెళ్ళివద్దామని సిగరెట్ ప్యాకెట్ అక్కడే ఉంచి బయటకు వెళ్ళాడు.

ఈలోగా మధుసూదన్ రావు ఎంటర్ అయ్యాడు. ఆ కుర్రాడి కోసం కబురుపెడితే అతడి కోసం పరుగులు తీశారు. మొత్తానికి వచ్చాడు. సిగరెట్ పాకెట్ ఎవరిదీ అని అడిగేసరికి తనదేనని అతడు జవాబు చెప్పాడు. అయితే నీకు వేషం లేదు . నాకు సిగరెట్ తాగేవాళ్ళు అంటే పడదు. నాకోసం నీ అలవాట్లు మార్చుకోవద్దు అని మధుసూదన్ రావు చెప్పేసారు. దాంతో ఆ కుర్రాడు నీరసంగా ఇంటిదారి పట్టాడు. ఇంతకీ ఆ కుర్రాడే కృష్ణంరాజు. ఈ సంఘటన జరిగిన రెండేళ్లకు గానీ కృష్ణంరాజు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వలేదు. మొత్తానికి వీరాభిమన్యు పాత్రకోసం శోభన్ బాబు సెలక్ట్. లేదంటే ఆ పాత్రలో రెబెల్ స్టార్ ఉండేవాడు.