Healthhealth tips in telugu

నోటి పూత కరోనా లక్షణమా… ఎలా గుర్తించాలో చూడండి

Sore Tongue A Sign Of Coronavirus : కరోనా విజృంభన రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి.వ్యాక్సిన్ వచ్చినా వాక్సిన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వేయించుకుంటే కరోనా విజృంభన కాస్త తగ్గుతుంది. అలాగే జాగ్రత్తలను కూడా తప్పనిసరిగా పాటించాలి. జాగ్రత్తలను పాటిస్తేనే వ్యాక్సిన్ కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కరోనా వచ్చిందా అని ప్రజలు భయపడి పోతున్నారు. నాలుక పై పూత వచ్చినా కరోనా వచ్చింది అని భయంతో వణికి పోతున్నారు. అలాగే చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. మొదట్లో కరోనా లక్షణాలు అంటే జ్వరం జలుబు శ్వాస సంబంధిత సమస్యలు అని చెప్పారు.

కానీ రోజు రోజుకి కొత్తకొత్త లక్షణాలు చేరుతున్నాయి. కొంతమంది కొంచెం కారం తిన్న నాలుక మంట ఎక్కువగా వస్తే అది కరోనా లక్షణంగా భావించే చాలా ఆందోళనకు గురవుతున్నారు. కానీ నోటి పూత అనేది కరోనా లక్షణం కాదని నిపుణులు చెబుతున్నారు. జ్వరం దగ్గు నాలుక రుచి కోల్పోవటం వంటివి కరోనా కి ప్రధాన లక్షణాలని ఇవి లేకుండా నోటిపూత ఉంటే మాత్రం అది కరోనా కాదని నిపుణులు చెపుతున్నారు.