ఉప్పు+మిరియాలు+నిమ్మకాయ…నమ్మలేని ప్రయోజనాలు ఎన్నో…?
Salt,Pepper,Lemon Benefits :మనం ప్రతి రోజు వంటింటిలో ఉప్పు,మిరియాలు,నిమ్మ కాయ వంటి వాటిని వాడుతూ ఉంటాం. అయితే ఈ మూడింటిని కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మిరియాలు, ఉప్పు మరియు నిమ్మకాయను కేవలం సలాడ్స్ లో ఉపయోగించటమే కాకుండా ఔషదంగా కూడా సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కొన్ని రోగాల చికిత్సకు ఈ దినుసులను ఉపయోగిస్తున్నారు. ఇవి ఖరీదు తక్కువగా ఉండటమే కాకుండా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నల్ల మిరియాలు,నిమ్మకాయ మరియు సముద్ర ఉప్పు చికిత్సలో ఎలా సహయపడతాయో తెలుసుకుందాం.
గొంతు నొప్పి
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,అరస్పూన్ నల్ల మిరియాల పొడి,ఒక స్పూన్ సముద్ర ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో కొన్ని సార్లు పుక్కిలించి ఉమ్మివేస్తే గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
ముక్కు దిబ్బడ
తుమ్ముల ద్వారా ముక్కు దిబ్బడ ఉపశమనం కలుగుతుంది. నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులను సమాన మొత్తంలో తీసుకోని మెత్తగా పొడిగా చేయాలి. ఈ పొడిని నెమ్మదిగా పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
బరువు తగ్గటానికి
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ నల్ల మిరియాల పొడి,రెండు స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే జీవక్రియ వేగవంతం
అవుతుంది. నిమ్మకాయలో పోలిఫెనోల్స్ అధికంగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది.