MoviesTollywood news in telugu

చిరంజీవి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కోట…ఏమిటో…?

kota srinivasa rao And chiranjeevi : స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి చాలామంది మంచిగానే చెబుతారు. ఇక విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాసరావు కూడా చిరంజీవి గురించి గొప్పగా చెబుతూ ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అసలు విషయంలోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి మంచి స్థితిలో సుప్రీం హీరోగా కొనసాగుతున్న సమయంలో ఖైదీ నెంబర్ 786మూవీ తీస్తున్నారు. ఇందులో పవర్ ఫుల్ విలన్ గా రావుగోపాలరావు అయితే బాగుంటుందని నిర్మాత విజయబాపినీడు అనుకున్నారు.

కానీ చిరంజీవి పట్టుబట్టీ కోట శ్రీనివాసరావు అయితే బాగుంటుందని ఒప్పించారు. అదే చిరుతో కోటకు మొదటి సినిమా. ఓరోజు షూటింగ్ కి అందరూ నటులు వచ్చేసారు. చిరంజీవి కూడా వచ్చేసారు. కానీ కోట శ్రీనివాసరావు రాలేదు. అందరిలో టెన్షన్.అయితే సూపర్ కృష్ణ తీస్తున్న పరశురాముడు మూవీ షూటింగ్ లో కోట ఉన్నారు. కోర్టు సీన్ కనుక బిజీగా నడుస్తోంది. మరోపక్క చిరంజీవి షూటింగ్ ఎలా అనే కంగారు.

వాస్తవానికి చిరంజీవి దగ్గరకి వెళ్లాలని అనుకున్నా, రెండు గంటల్లో షూటింగ్ అయిపోతుందని,మీరు రావాలని కృష్ణ కోరడంతో కోట కాదనలేక పోయారు. తీరా షూటింగ్ 5 గంటలు పట్టింది. దాంతో చిరంజీవి సినిమా షూటింగ్ దగ్గరకు వెళ్లేసరికి విజయబాపినీడు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ఇది చూసిన కోట మెల్లగా చిరంజీవి దగ్గరకు వెళ్లి వివరణ ఇవ్వబోతుంటే,టెన్షన్ వద్దు.బిజీ అయ్యే కొద్దీ కాల్షీట్స్ ఇబ్బంది వస్తుంది’ అంటూ చిరంజీవి ఈజీగా చెప్పేసి నవ్వేయడంతో షూటింగ్ సాగిపోయింది. ఈ విషయం కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్యూలో తలచుకుని చిరంజీవి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు.