MoviesTollywood news in telugu

భర్త కోసం సుహాసిని చేసిన త్యాగం ఏమిటో తెలుసా ?

Telugu Actress Suhasini :ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని నటి సుహాసిని బాగా వంటబట్టించుకున్నారు. కమల్ హాసన్ అన్న చారు హాసన్ కూతురైన సుహాసిని నటిగా అన్నీ తెలుసనే భావనతో మొదట్లో కొంచెం పొగరుగా ఉన్నా, తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాక నలుగురితో చనువుగా మాట్లాడ్డం, క్రమశిక్షణతో మెలగడం వంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని తెలుగు ఇండస్ట్రీ గురించి సుహాసిని గొప్పగా చెబుతూ ఉంటుంది.

తెలుగులో శోభన్ బాబు,కృష్ణ ,మెగాస్టార్ చిరంజీవి,బాలయ్య,నాగార్జున ఇలా అగ్ర హీరోలు అందరి సరసన నటించడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అక్క, అత్త పాత్రలతో రాణిస్తూ తనదైన ముద్ర వేస్తోంది. తెలుగు ఇండస్ట్రీతో బలమైన బంధం ఉందని ఆమె చెబుతూ ఉంటారు. అయితే ఈమె మొదట్లోనే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడమే కాకుండా మెగాఫోన్ పట్టి ఓ మూవీకి డైరెక్షన్ కూడా చేసారు.

నిజానికి సినిమాటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న సుహాసిని స్క్రిప్ట్ రైట్రర్ గా రాణించి, 1996లో ఇందిర మూవీకి డైరెక్షన్ చేసారు. అయితే పెళ్లి తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకొలేదు. ఎందుకంటే ఆమె భర్త స్టార్ డైరెక్టర్ మణిరత్నం. ఆయన కోసం డైరెక్షన్ లోకి మళ్ళీ అడుగువేయలేదని సుహాసిని చెప్పారు. అయితే ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొంటూ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."