MoviesTollywood news in telugu

హీరో ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu Actress Deepa Venkat :తెలుగు సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంది. రోజా రమణి, సరిత,సింగర్ సునీత ఇలా చాలామంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. అలాగే హీరోలకు కూడా ఎస్పీ బాలు,మనో,సాయికుమార్,ఘంటసాల రత్న కుమార్, హేమచంద్ర వంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. ఇక చిత్రం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ కిరణ్ తన కెరీర్ లో వరుస హిట్స్ తో దూసుకుపోయాడు.

అయితే ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కిందికి దిగిపోయాడు. చివరకు ఈలోకం నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికీ అతడి ఆత్మహత్య మిస్టరీగానే మిగిలింది. అయితే ఉదయ్ కిరణ్ సిస్టర్ స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెబుతుందని ఈమధ్య పలు కథనాలు వస్తున్నాయి. తీరా చూస్తే ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన శ్రీరామ్ మూవీలో అనిత హీరోయిన్ గా చేసింది. ఇందులో ఉదయ్ చెల్లిగా దీప వెంకట్ నటించింది.

నిజానికి దీప వెంకట్ మొదట్లో డబ్బింగ్ చెప్పేదట. వడ్డే నవీన్, రాశి జంటగా నటించిన మనసిచ్చి చూడు మూవీలో నటించింది. ఇలా సినిమాల్లో చేస్తూనే డబ్బింగ్ కూడా చెబుతోంది. ఈమెకు తెలుగుతో పాటు తమిళం బాగా వచ్చు. దాంతో నటనకు దూరం జరిగి, కోలీవుడ్ లో డబ్బింగ్ చెబుతోంది. కత్రినా కైఫ్, విద్యాబాలన్,సిమ్రాన్,జ్యోతిక,సౌందర్య,స్నేహ,లక్ష్మీరాయ్,అనుష్క శెట్టి తదితర హీరోయిన్స్ కి దాదాపు 100సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.