జగపతిబాబు హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Telugu Actress Sukanya :పగ, ప్రతీకారం మధ్య నలిగిపోయే రెండు కుటుంబాల మధ్య ఒక యువతి, ఒక యువకుడు ప్రేమ పుట్టడం అది అనేక మలుపులు తిరిగి సుఖాంతమవ్వడం కాన్సెప్ట్ తో అప్పట్లో వచ్చిన సినిమా పెద్దరికం. ఈ మూవీలో జగపతిబాబు ప్రేమలో పడిన హీరోయిన్ గా సుకన్య నటించింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. దాంతో సుకన్యకు మంచి పేరు వచ్చింది.
సడన్ గా ఆ మధ్య వచ్చిన శ్రీమంతుడు మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు మథర్ పాత్రలో సుకన్య మెరిసింది. అయితే పెద్దరికం తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆడకపోవడం, తరువాత ఛాన్స్ లు రాకపోవడం వలన ఇండస్ట్రీకి సుకన్య దూరమైంది. మిగిలిన భాషల్లో బాగానే రాణించింది.
ఇక తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ శ్రీమంతుడు తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అలాగని గతంలో మాదిరిగా తమిళ,మలయాళ భాషల్లో కూడా సుకన్య బిజీగా లేదు. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన సుకన్య తెలుగులో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.