MoviesTollywood news in telugu

నటుడు చంద్రమోహన్ డాటర్స్ ఏం చేస్తున్నారో తెలుసా?

Telugu Senior actor Chandramohan :ఒకప్పుడు హీరోగా చేసి,ఆతర్వాత కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా ఇప్పటికీ రాణిస్తున్న చంద్రమోహన్ సరసన నటించిన హీరోయిన్స్ టాప్ రేంజ్ కి వెళ్తారని నానుడి. శ్రీదేవి,జయప్రద,జయసుధ ఇలా చాలామంది టాప్ హీరోయిన్స్ గా ఎదిగారు. అయితే ఇప్పటికీ చిన్నా చితకా పాత్రలతో రాణిస్తున్న చంద్రమోహన్ ప్రస్తుతం 81సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో కి వచ్చిన కొత్తలో నెగెటివ్ రోల్స్ కూడా చేసి చంద్రమోహన్ మెప్పించాడు.

లక్ష్మణరేఖ,గంగమంగ వంటి సినిమాల్లో విలన్ వేషాలు వేసాడు. ఇక హీరో క్యారెక్టర్ తో పాటు కామెడీ తో కూడిన హీరో రోల్స్ వేసి అలరించాడు. కామెడీ పండించడం కష్టమని ఆయన అంటున్నారు. అయితే సినిమాల్లో నటిస్తూనే, ఆర్ధికంగా స్థిరపడడం కోసం భూములపై పెట్టుబడి పెట్టారు. ఈ విషయంలో నటభూషణ్ శోభన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. దాదాపు 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో వివిధ పాత్రలు పోషించినప్పటికీ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించలేదని చంద్రమోహన్ చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమా సమయంలో బైపాస్ సర్జరీ చేయించు కున్నట్లు తెలిపారు. డీజే షూటింగ్ సమయంలో ఆరోగ్యం బాగోకపోవడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త అశోక్ ఫార్మసిస్ట్.రెండో కూతురు మాధవి డాక్టర్. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించిన చంద్రమోహన్ దాదాపు 932 సినిమాల్లో నటించాడు. నాలుగు తరాల తారలతో నటులతో నటించాడు. ప్రస్తుతం అడపాదడపా నటిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."