ఆరోజుల్లోనే ట్రిక్ ప్లే చేసిన మహానటి…తెలిస్తే షాక్ అవుతారు

Tollywood Heroine Savitri :సినిమాల్లో ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చాయి గానీ, ఒకప్పుడు ట్రిక్స్ ఉపయోగించి మెప్పించేవారు. ముఖ్యంగా విఠలాచార్య మూవీస్ అలానే ఉంటాయి. ఆయన సినిమాల్లో కొన్ని సీన్స్ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తాయి. ఇక సుప్ర‌సిద్ధ న‌వ‌ల ‘కాలాతీత వ్య‌క్తులు’ ప్రేర‌ణ‌తో 1963లో వచ్చిన చ‌దువుకున్న అమ్మాయిలు మూవీ లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మహానటి సావిత్రి, కృష్ణ‌కుమారి, స‌రోజ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావును సావిత్రి, కృష్ణ‌కుమారి లవ్ చేస్తారు. అయితే అక్కినేని మ‌న‌సులో కృష్ణ‌కుమారి ఉంటుంది.

అయితే పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ రోల్ చేసిన శోభ‌న్‌బాబు కి సావిత్రి భార్య అవుతుంది. అయితే సావిత్రి కంటే కృష్ణ‌కుమారి,స‌రోజ కాస్త పొడ‌వుగా ఉంటారు. అయితే ఈ సినిమాలో ఆ ముగ్గురు హీరోయిన్స్ కాంబినేష‌న్ సీన్ల‌లో త‌ను పొట్టిగా కనపడకుండా ఉండేలా సావిత్రి ఓ ట్రిక్ ప్లే చేసింది. వివరాల్లోకి వెళ్తే, సావిత్రి తోడుగా దాక్షాయ‌ణి అనే అమ్మాయి ఉంటూ సావిత్రి మేక‌ప్ వంటివన్నీ శ్ర‌ద్ధ‌గా చూసేది. అంతేకాదు, ఆమె ఏ స‌న్నివేశంలో ఏ న‌గ‌లు పెట్టుకుందో,ఏ చీర క‌ట్టుకుందో కేశాలంక‌ర‌ణ వివ‌రాలతో పాటు స‌న్నివేశం త‌ర్వాత వ‌చ్చే స‌న్నివేశం వివ‌రాలు అన్నీ ఓ పుస్త‌కంలో రాస్తుండేది.

సొంత న‌గ‌లు వాడితే స‌హాయ ద‌ర్శ‌కుడికి ఆ వివ‌రాలు చెప్పేది. ఎప్పుడు మ‌ళ్లీ అవ‌స‌రం వ‌చ్చినా, స‌న్నివేశం చెబితే ఆ న‌గ‌ల‌న్నీ ఆ అమ్మాయి తెచ్చేది. ఇక ఈ మూవీలో సావిత్రి, కృష్ణ‌కుమారి, స‌రోజ క‌లిసి వుండే సీన్స్ లో వాళ్లిద్ద‌రి కంటే త‌ను పొట్టి కాబ‌ట్టి, సింగ‌పూర్ నుంచి ప్రత్యేకించి తేప్పించుకున్న హైహీల్స్ సావిత్రి వేసుకునేది. సెట్స్ మీద ఎప్ప‌టిక‌ప్పుడు సావిత్రికి సంబంధించిన షాట్స్ గ‌మ‌నించే దాక్షాయ‌ణి, ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా, సైలెంట్ గా సావిత్రి కాళ్ల ద‌గ్గ‌ర‌కు ఆ చెప్పులు తెచ్చి, అక్కా! ఆ చెప్పులు తెచ్చానని చెవిలో చెప్పి వెళ్లిపోయేది. సావిత్రి వాటిని వేసుకునేది. అలా ఎక్కడా పొట్టిగా కన్పించకుండా సావిత్రి జాగ్రత్త పడింది.