MoviesTollywood news in telugu

బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేసిన రవితేజ సంక్రాంతి సినిమాలు

Ravi Teja Movies at Sankranthi :చిన్న చిన్న పాత్రలు చేస్తూ,అంచెలంచెలుగా హీరోగా ఎదిగి,మాస్ మహారాజ్ గా పేరుతెచ్చుకున్న రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. స్వయంకృషితో స్టార్ హీరో అయ్యాడు. అభిమానులకు రవితేజ మూవీస్ పండగ వాతావరణం తెస్తాయి. ఇక పండగల్లో పెద్ద పండుగ సంక్రాంతికి మూవీస్ వస్తే, సందడే సందడి. 2000జనవరి 7న రిలీజైన అన్నయ్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సోలో హీరోగా ఈ అబ్బాయి చాలా మంచోడు మూవీతో 2003సంక్రాంతి మూవీగా వచ్చింది. అగస్త్యన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వాణి,సంగీత హీరోయిన్స్ గా చేసారు. క్లాస్ మూవీగా ఏవరేజ్ అయింది. కీరవాణి ట్యూన్స్ అదిరిపోయాయి.

వివి వినాయక్ డైరెక్షన్ లో డివివి దానయ్య నిర్మించిన కృష్ణ మూవీ 2008సంక్రాంతి కానుకగా వచ్చింది. త్రిష హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో రవితేజ చెలరేగిపోయి నటించాడు. 53కేంద్రాల్లో 100డేస్ ఆడిన ఈ మూవీ ఆ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ గా నిల్చింది. అలాగే శంభో శివశంభో మూవీ కూడా సంక్రాంతికి వచ్చింది. ఇందులో రవితేజా,శివబాలాజీ,అల్లరి నరేష్ హీరోలుగా నటించారు. రోజా కీలక పాత్ర పోషించిన ఈ మూవీని తమిళ డైరెక్టర్ సముద్రగని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎబో ఏవరేజ్ గా నిల్చింది.

ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో 2011జనవరి 12న వచ్చిన మిరపకాయ్ మూవీ లో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా రవితేజ నటన సూపర్భ్. రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీ 144సెంటర్స్ లో 50డేస్ ఆడింది. కాగా కరోనా మొదటి వేవ్ తర్వాత ఈ ఏడాది జనవరి9న రిలీజైన క్రాక్ మూవీ లో రవితేజ మూవీ ఎనర్జటిక్ గా నడిచింది. బలుపు తర్వాత శృతిహాసన్ కి రవితేజ ఇచ్చిన మరో హిట్ మూవీ ఇది. వరలక్ష్మి, సముద్ర గని విలన్స్ గా అదరగొట్టేసారు. దీంతో గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన రవితేజ మూడవ మూవీ కూడా హిట్ అయింది. థమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.