కత్రినా కైఫ్‌ ఆస్థి విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే

katrina kaif net worth :’మల్లీశ్వరి’ సినిమాతో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్‌ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ‘అల్లరి పిడుగు’ చిత్రం తర్వాత పూర్తిగా టాలీవుడ్ కి దూరమై,బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌ ‘చిక్నీ చమేలీ’,’షీలాకీ జవానీ’ అంటూ ఐటం సాంగ్స్‌తోనూ అదరగొట్టింది. అయితే ఈమె బాగానే సంపాదించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించి,మెప్పించిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఆమె ఒక్క సినిమాకు 10 కోట్ల రూపాయల వరకూ అందుకుంటుందని టాక్. ఇక వాణిజ్య ప్రకటనలు,తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. ఇవేకాక ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ‘రీబూక్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ఆమె రీబూక్‌ నుంచి కూడా బాగానే దక్కించుకుంటోందని టాక్. అందుకే కత్రినాకు 150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉందని వినిపిస్తోంది.

ఒక్క ముంబైలో సుమారు 8 కోట్లు విలువ చేసే, ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. లండన్‌లో కూడా 7 కోట్ల విలువ చేసే బంగ్లా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తు న్నాయి. అంతేకాదు, కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. కాగా బూమ్‌’ సినిమాతో బాలీవుడ్ లో ప్రవేశించింది. వస్తూనే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్‌ దక్కించుకుని, విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ భామ ఇదే సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డు కూడా సొంతం చేసుకుంది.