ఎన్‌టి‌ఆర్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Subbu Movie Heroine sonali joshi :ఇండస్ట్రీ చాలా చిత్ర విచిత్రమైనది. ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో, ఎవరు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం కష్టం. అందుకే ఇండస్ట్రీలో ఛాన్స్ లు వస్తున్నపుడు కూడబెట్టడంతో పాటు, యాడ్స్ వంటివి చేస్తూ, వేరే రంగాల్లో పెట్టుబడులు పెడుతు న్నారు. ఇందులో హీరో,హీరోయిన్స్ సమాన రేంజ్ లోనే ఉన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిరోజుల్లో నటించిన సుబ్బు సినిమాలో సోనాలి జోషి హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం వెబ్ సిరీస్ యుగం నడుస్తున్న నేపథ్యంలో సోనాలి జోషి వెబ్ సిరీస్ లో చేయడానికి అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. అమెజాన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే వెబ్ సిరీస్ తో సోనాలి జోషి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక సుబ్బు ఆతర్వాత ‘నాన్న నేను అబద్ధం’ వంటి చాలా తక్కువ సినిమాల్లో సోనాలి జోషి చేసింది.

వీటితో కొంచెం మంచి పేరు వచ్చినా , ఆతర్వాత చేసిన ‘రాంబాబు గాడి పెళ్ళాం’ వంటి మూవీస్ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడి కి ఛాన్స్ లు రాలేదు. అదేసమయంలో బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చాయి. మొత్తానికి టాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చినా కూడా బాలీవుడ్ లో సినిమాల కారణంగా ఒప్పుకోలేకపోయింది. మరోపక్క బాలీవుడ్ లో కూడా ఫేడ్ అవుట్ అవ్వడంతో అక్కడా ఛాన్స్ లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.