స్టార్ హీరోయిన్స్ హాబీలు ఏమిటో తెలుసా?

Tollywood star heroines hobbies :ఎంత పెద్ద స్టార్ హీరో అయినా,హీరోయిన్ అయినా కొన్ని ఇష్టాయిష్టాలు,హాబీస్ ఉంటాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న భామలకు కూడా కొన్ని హాబీస్ ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే అలవైకుంఠపురంలో మూవీతో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకుని,పలు సినిమాల్లో దూసుకుపోతున్న పూజా హెగ్డే కు బీచ్ కి వెళ్లడం హాబీ. ఈమెకు టెర్రస్ గార్డెన్ అంటే ఇష్టం. అయితే స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతకు గార్డెనింగ్ అంటే ఇష్టం.

అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ కి కూడా గార్డెనింగ్ అంటే హాబీ. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుతూ ఉంటుంది. స్వర్గీయ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి పెయింటింగ్ వేయడం హాబీ. ఆ పెయింటింగ్స్ ని ప్రదర్శనకు పెట్టాలని కోరిక. హీరోయిన్ నభా నటేష్ కి పెయింటింగ్ అంటే హాబీ. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు బ్రష్ పట్టుకుని పెయింట్స్ వేసేస్తుంది.

చందమామ కాజల్ అగర్వాల్ కి బుక్స్ రీడింగ్ హాబీ. పెద్ద పెద్ద నవల్స్ ని సైతం వేగంగా పూర్తిచేస్తుందట. హీరోయిన్ పాయల్ కి వంట చేయడం, వాటిని రుచి చూడడం హాబీ. ఇక టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నాకు గిటార్ ప్లే చేయడం హాబీ. మిల్కీ బ్యూటీ తమన్నాకు ఆభరణాలు కొనుగోలు చేయడం అంటే హాబీ. హీరోయిన్ నివేదా పేతురాజ్ కి కార్ల కలెక్షన్ హాబీ. ఈమెకు స్పోర్ట్స్ అంటే ఇష్టం.