ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ నటి శ్రావణి భర్త ఎవరో తెలుసా?

intiki deepam illalu serial actress sravani : సీరియల్స్ కి బుల్లితెర మీద మంచి క్రేజ్ ఉండడంతో దాదాపు చాలా సీరియల్స్ వివిధ చానల్స్ లో వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఛానల్ లో వస్తున్న ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో నటీనటులు తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు.

ఇందులో నటిస్తున్న దమయంతి గతంలో చాలా సీరియల్స్ లో నటించింది. ఈమె అసలు పేరు శ్రావణి ప్రియ. 1990నవంబర్ 23న రాజమండ్రిలో జన్మించిన ఈమె 9వ తరగతి చదువుతున్న సమయంలో ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఐడియల్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తిచేసిన ఈమెకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. ఈమె ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరికి ఓ పాప ఉంది. డైరెక్టర్ కం హీరో అయిన ఆమె భర్తతో కల్సి జననం మూవీలో హీరో హీరోయిన్స్ గా నటించారు.

జెమినిలో ప్రసారమైన కల్యాణ తిలకం సీరియల్ తో బుల్లితెరకు దమయంతి ఎంట్రీ ఇచ్చింది. తొలిసిరియల్ తో మంచి గుర్తింపు రావడంతో వరుస సీరియల్స్ లో ఛాన్స్ లు వచ్చాయి. ప్రస్తుతం ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో నటిస్తున్న ఈమె గతంలో వెయ్యి అబద్ధాలు,బలుపు,లయన్ వంటి సినిమాల్లో కూడా నటించింది. అభిషేకం,ఆడదే ఆధారం,భార్యామణి,ఆకాశగంగ,అగ్ని సాక్షి,మూగమనసులు,స్వాతి చినుకులు,గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ లో నటించింది.