వెంకటేష్ కెరీర్ లో ఎన్ని రీమేక్ సినిమాలు హిట్ …?

Venkatesh Remake Movies : విభిన్న సినిమాలు చేస్తూ విక్టరీకి మారుపేరుగా మారిన దగ్గుబాటి వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీస్ సైతం చేయడంలో ముందంజలో ఉన్నాడు. అయితే రీమేక్ సినిమాలు కూడా ఎక్కువే చేసాడు. వాటి వివరాల్లోకి వెళ్తే,తొలినాళ్లలో వచ్చిన బ్రహ్మపుత్రుడు మూవీ 1987లో తమిళ మూవీ మైఖేల్ రాజాకు రిమేక్ గా తీశారు. దర్శక రత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన బ్రహ్మపుత్రుడు 1988లో రిలీజయింది.

1985లో సన్నీడియోల్ హీరోగా హిందీలో వచ్చిన అర్జున్ మూవీకి రీమేక్ గా భారతంలో అర్జునుడు మూవీ తీశారు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెంకీ సరసన ఖుష్బూ చేసింది.1987లో కె మురళీమోహనరావు డైరెక్షన్ లో వచ్చిన త్రిమూర్తులు మూవీని హిందీలో అమితాబ్ హీరోగా వచ్చిన నసీబ్ మూవీకి రీమేక్ గా తీశారు.

1988లో మలయాళం మూవీ ఆర్యన్ మూవీకి రీమేక్ గా ధ్రువ నక్షత్రం మూవీని 1989లో రిలీజ్ చేసారు. వై నాగేశ్వరరావు డైరెక్ట్ చేసారు. తీర్ధ కనలై తమిళ మూవీకి రీమేక్ గా 1988లో వచ్చిన వారసుడొచ్చాడు మూవీని ఏ మోహన్ గాంధీ తెరకెక్కించారు. హిందీలో అనిల్ కపూర్ హీరోగా వచ్చిన తేజాబ్ మూవీకి రీమేక్ గా వెంకీ హీరోగా టూటౌన్ రౌడీగా తీశారు.

తమిళ మూవీ చిన్న తంబికి రీమేక్ గా చంటి సినిమా తీస్తే, ఇండస్ట్రీ హిట్ అయింది. వెంకీ విలక్ష ణ నటన కనబరచగా, రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసాడు. మీనా హీరోయిన్ గా చేసింది.కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన సుందరకాండ మూవీ తమిళ సినిమాకు రీమేక్ గా తీశారు. విజయకాంత్ హీరోగా వచ్చిన చిన్న గౌండర్ మూవీకి రీమేక్ గా వెంకీ హీరోగా చిరాయుడు మూవీ తీశారు. బి గోపాల్ డైరెక్టర్.

రజనీకాంత్ తమిళంలో నటించిన అన్నామలై కి రీమేక్ గా తెలుగులో వెంకీతో కొండపల్లి రాజా మూవీ తీశారు. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1993లో రిలీజయింది. ఎంగ చిన్నరాజా తమిళ మూవీకి రీమేక్ గా అబ్బాయిగారు మూవీ తీశారు. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే ఆంగ్ల మూవీ ఆధారంగా కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ముద్దుల ప్రియుడు తీశారు. గోవిందా హీరోగా హిందీలో వచ్చిన అంకెన్ మూవీకి రీమేక్ గా పోకిరి రాజా మూవీ తీశారు.

తమిళంలో శరత్ కుమార్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీకి రీమేక్ గా అదే టైటిల్ తో వెంకీ డ్యూయల్ రోల్ తో సినిమా తెరకెక్కింది.తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తూ, అలీని హీరోగా పరిచయం చేసిన యమలీల మూవీ అప్పటిలో సూపర్ హిట్. 1995లో వచ్చిన ఈ మూవీని హిందీలో తక్ దీర్ వాలా పేరిట హిందీలో తీయగా వెంకీ హీరోగా నటించాడు.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ అప్పట్లో హిట్. సౌందర్య హీరోయిన్. అయితే ఇది తమిళ మూవీ తైకులమే తైకులమే మూవీకి రీమేక్. తమిళ మూవీ సొలమలై కి రీమేక్ గా వెంకీ హీరోగా శీను మూవీ1998లో వచ్చింది. అలాగే 1999లో రాజా మూవీ కూడా సౌందర్యంతో కల్సి వెంకీ నటించి హిట్ అందుకున్నాడు. ఇది తమిళ మూవీకి రీమేక్.

తమిళంలో విక్రమ్ హీరోగా వచ్చిన జెమిని మూవీకి రీమేక్ గా అదే పేరుతొ వెంకీ హీరోగా మూవీ 2002లో రిలీజయింది. తమిళంలో సూర్య హీరోగా వచ్చినా కాకా కాకా మూవీకి రీమేక్ గా తెలుగులో వెంకీ హీరోగా ఘర్షణ మూవీ 2004లో రిలీజయింది. తమిళంలో ఆనందం మూవీకి రీమేక్ గా తెలుగులో వెంకీ, శ్రీకాంత్ హీరోలుగా2005లో సంక్రాంతి మూవీ వచ్చింది.

కన్నడ మూవీ ఆత్మరక్షక్ మూవీకి రీమేక్ గా 2010లో పి వాసు డైరెక్షన్ లో నాగవల్లి మూవీ వచ్చింది. 2012లో వచ్చిన బాడీగార్డ్ మూవీ మలయాళం సినిమాకు రీమేక్. హిందీ మూవీ బోల్ బచ్చన్ కి రీమేక్ గా వెంకీ,రామ్ హీరోలుగా మసాలా మూవీ 2013లో వచ్చింది. 2014లో వచ్చిన దృశ్యం మూవీ కూడా మలయాళం మూవీకి రీమేక్.

2015లో పవన్ కళ్యాణ్ ,వెంకీ కల్సి నటించిన గోపాల గోపాల మూవీ రిలీజై మంచి హిట్ అందుకుంది. హిందీ మూవీ ఓ మై గాడ్ కి రీమేక్ గా వచ్చింది. 2017లో గురు మూవీ రిలీజయింది. ఇది తమిళ మూవీకి రీమేక్. కాగా తాజాగా తమిళంలో వచ్చిన అసురన్ మూవీకి రీమేక్ గా నారప్ప మూవీ తీశారు. ఇది ఓటిటి ప్లాట్ ఫారం వేదికగా అమెజాన్ లో విడుదల అయింది.