జగపతి బాబు పారితోషికం ఎంతో తెలుసా… ఒకేసారి ఎన్ని సినిమాలో…?

Jagapati babu remuneration : ఫ్యామిలీ హీరోగా మెప్పించిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రలను పోషిస్తున్నారు. ఒక వైపు తండ్రి పాత్రలో మరోవైపు విలన్ పాత్రలో నటిస్తూ తనదైన శైలిలో పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ సినిమా హిట్ కావడానికి కారణం అవుతున్నాడు .

ప్రస్తుతం జగపతి బాబు చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి లెజెండ్ సినిమాతో మొదటిసారిగా విలన్ నటించి బాగా ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. జగపతి బాబు పారితోషికం విషయానికి వచ్చేసరికి ఒక్కో సినిమాకి కోటి నుంచి మూడు కోట్ల మధ్య తీసుకుంటున్నాడు. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో నటిస్తూ చాలా బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం సలర్ మూవీ, వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమా, టక్ జగదీష్ సినిమా, అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న సినిమా, కన్నడ లో ఒక సినిమా, మహా సముద్రం సినిమా, లక్ష్య సినిమా, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.