గోకులంలో సీత సినిమాలో రాశికి ఛాన్స్ రావటానికి కారణం ఎవరో తెలుసా ?

Tollywood Heroine raasi gokulamlo seetha movie : టాలీవుడ్ లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత హీరోయిన్ గా మారి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది రాశి. గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించింది ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చింది

ఈ సినిమాలో రాశి కి అవకాశం రావడానికి చిరంజీవి భార్య సురేఖ కారణమని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గోకులంలో సీత సినిమాకి ముందు రాశి శుభాకాంక్షలు సినిమాలో నటించింది. రాశి అందం అభినయం నచ్చడంతో పాటు, అప్పటికే రాశి కుటుంబంతో చిరంజీవి భార్య సురేఖ కు పరిచయం ఉంది.

దాంతో రాశి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పిలిచి రాశి ఫోటోలను అడిగాడట. రాశి వాళ్ళ నాన్న ట్రెడిషనల్ డ్రస్ ల్లో ఉన్న ఫోటోలని ఇచ్చాడట. అయితే సురేఖ మోడ్రన్ డ్రెస్ లతో ఫోటో షూట్ చేసి గోకులంలో సీత సినిమాలో పాత్రకు రాశి పర్ఫెక్ట్ గా సరిపోతుందని ముత్యాల సుబ్బయ్యకు రికమెండ్ చేశాడట. అలా రాశి కి పవన్ కళ్యాణ్ గోకులంలో సీత సినిమాలో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరలో సీరియల్ చేస్తుంది. ఆ సీరియల్ కి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది.